AGITATION: విమానాశ్రయం వద్దు.. భూములే కావాలి..
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:11 AM
మాకు విమానశ్రం వద్దు.. మాభూములే కావాలంటూ ఇనచార్జి కలెక్టర్ శివనారాయణశర్మకు రైతులు విన్నవించారు. ఇటీవల కూడేరు ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ వస్తుందని, ఇందుకు అధికారులు భూములు గుర్తిస్తున్నారని, మీడియా, సోషల్‌మీడియాలలో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది.
అనంతపురం టౌన, మార్చి24(ఆంధ్రజ్యొతి): మాకు విమానశ్రం వద్దు.. మాభూములే కావాలంటూ ఇనచార్జి కలెక్టర్ శివనారాయణశర్మకు రైతులు విన్నవించారు. ఇటీవల కూడేరు ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ వస్తుందని, ఇందుకు అధికారులు భూములు గుర్తిస్తున్నారని, మీడియా, సోషల్‌మీడియాలలో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. సోమవారం ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టరేట్‌వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం ఇనచార్జి కలెక్టర్‌ను గ్రీవెన్సలో కలిశారు. రైతులు మాట్లాడుతూ మాపొలాల్లో ఎయిర్‌పోర్టు వస్తుందంటున్నారు, విమానశ్రయం వద్దు, మాభూములే కావాలని డిమాండ్ చేశారు. మేము విమానంలో పోయేవాళ్లం కాదని, ఇక్కడే పొలం పనులు చేసుకుని బతుకుతున్నామన్నారు. తులం బంగారం కూడా కొనలేని స్థితిలో ఉన్నామన్నారు. మరోవైపు ఈ పొలాల్లో బోర్లు కూడా అధికంగా ఉన్నాయని, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగుచేస్తున్నామన్నారు. అలాంటి భూములు ఎయిర్‌పోర్టుకు ఇమ్మంటే ఇచ్చేది లేదని, బలవంతం చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. అనంతరం ఇనచార్జి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.