Natural farming ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:21 AM
ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అడిషనల్ సెక్రటరీ, ఐఏఎస్ అనిల్ కుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
-కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ, ఐఏఎస్ అనిల్‌కుమార్
రాప్తాడు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అడిషనల్ సెక్రటరీ, ఐఏఎస్ అనిల్ కుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
మహిళా రైతు లక్ష్మిదేవి 18 సెంట్ల స్థలంలో సాగు చేసిన 22 రకాల ఆకుకూరలు, కూరగాయలను, మరో మహిళా రైతు 4 ఎకరాల్లో సాగు చేసిన డ్రాగన ఫ్రూట్ పంటను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని మహిళా సంఘం, రైతు మహిళా సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామంలో ఎంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆరా తీశారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నోలాభాలు, ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం సాగు వైపు దృష్టి సారిస్తోందని, ఊరూరా ప్రకృతి వ్యవసాయం సాగు చేసేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. కార్యక్రమంలో జాతీయ జీవనోపాదుల మిషన రాష్ట్ర యాంకర్ పర్సన బిబు సంతో్‌షకుమార్, ట్రైనీ కలెక్టర్ సచినరాహర్, అడిషనల్ సీఈఓ సెర్ఫ్ శ్రీరాములు నాయుడు, స్ర్తీనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ శైలజ, మండల స్థాయి అధికారులు, రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..