MINISTER SAVITHA: నాన్న ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:48 PM
నాన్న ఆశీర్వాదాలే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మండలంలోని రాంపురం పంచాయతీలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ రూరల్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): నాన్న ఆశీర్వాదాలే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మండలంలోని రాంపురం పంచాయతీలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా మంత్రి కుటుంబ సభ్యులతో రామచంద్రారెడ్డి ఘాట్‌వద్దకు చేరుకుని సమాధికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. తండ్రి, స్నేహితులు తనకెంతో నేర్పారని పేదవారికి సహాయ సహకారాలు అందించే గుణం వారి నుంచే వచ్చిందన్నారు. ఎమ్మెల్యే కావడం నా కలఅన్నారు. 2009నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే సీటుకోసం కష్టపడ్డానన్నారు. ఇప్పటికి కలనెరవేరిందన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ చారిటుబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి కాంస్యవిగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం రాంపురం పంచాయతీ నాలుగు గ్రామాల్లో చీరలు, గృహోపకరణాలు పంపిణీ చేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
సూపర్‌హిట్ సభను విజయవంతం చేద్దాం: సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ బహిరంగ సభను విజయవంతం చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ పరిశీలకుడు నరసింహారావు, మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 10న అనంతపురంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నామని, సభకు డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, తదితర ముఖ్య నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మార్క్‌ఫెడ్ చైర్మన బంగారురాజు, కేశవయ్య, రఘువీరచౌదరి, సిద్దయ్య, శ్రీరాములు, బాబుల్‌రెడ్డి, త్రివేంద్ర, రమణమ్మ, చంద్రకాంతమ్మ పాల్గొన్నారు.
మంత్రి సవితకు అండగా ఉంటాం
పెనుకొండ టౌన: ప్రాణమున్నంతవరకు వడ్డెర కులస్థులు మంత్రి సవితకు అండగా ఉంటామని వడ్డెర సాధికార సమితి మీడియా కోఆర్డినేటర్ పల్లపు మహేంద్ర పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో వడ్డె వెంకట్, పలువురు నాయకుల ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. కడప రామాంజి, రవిమోహన, అమర్నాథ్, నిడిమామిడప్ప, సర్పంచ వినోద్‌కుమార్, వడ్డెశ్రీనివాస్, వెంకటరమణప్ప, రవికుమార్, లక్ష్మీనారాయణ, సాయిప్రసాద్, రఘు, హనుమప్ప, పల్లె బాలకృష్ణ, గంగాధరప్ప, సోమశేఖర్, నాగరాజు పాల్గొన్నారు.