Share News

కోటి దీప కాంతులు..!

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:35 AM

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అనంత కోటి దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో లలితకళా పరిషతలో మంగళవారం సాయంత్రం కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. విజయవాడ అష్టాక్షరి పీఠానికి చెందిన త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు కార్తీక ...

కోటి దీప కాంతులు..!
Ramanuja Jeeyar Swami Giri Pradakshina

అనంతలో అరుణాచల గిరిప్రదక్షిణ

శివనామస్మరణతో పులకించిన భక్తులు

అనంతపురం టౌన, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అనంత కోటి దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో లలితకళా పరిషతలో మంగళవారం సాయంత్రం కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. విజయవాడ అష్టాక్షరి పీఠానికి చెందిన త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు కార్తీక పురాణంపై అనుగ్రహభాషణం చేశారు. అరుణాచలం వెళ్లలేని భక్తులకోసం పరిషత ఆవరణలో అరుణాచల గిరి నమూనాను ఏర్పాటు చేశారు. వందలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసి తన్మయత్వం పొందారు. కార్యక్రమంలో కోటి దీపోత్సవ సమితి అధ్యక్షుడు వెంకటేష్‌ గుప్త, ఉపాధ్యక్షుడు సందీప్‌ గుప్త, ప్రధాన కార్యదర్శి విజయసాయికుమార్‌, కోశాధికారులు వేణుగోపాల్‌, అంబటి రాజు, సభ్యులు సత్రసాల మంజునాథ్‌, ముడియం రమణ, సత్రసాల నాగేంద్ర, సత్యనారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:35 AM