Share News

SPORTS MEET: క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:25 AM

క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎంపీడీవో రవిప్రసాద్‌ అన్నారు. నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరులో శనివారం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించారు.

SPORTS MEET: క్రీడలతో మానసికోల్లాసం
ఉద్దేహాళ్‌లో క్రీడా పోటీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు

ఉరవకొండ,నవంబరు29(ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎంపీడీవో రవిప్రసాద్‌ అన్నారు. నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరులో శనివారం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉపాధ్యాయపోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారు డివిజనస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంఈవోలు ఈశ్వరయ్య, ఎర్రిస్వామి పాల్గొన్నారు.

బొమ్మనహాళ్‌(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉద్దేహాళ్‌ గ్రామ జడ్పీ పాఠశాల మైదానంలో శనివారం ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహించారు. వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఎంపీడీఓ విజయభాస్కర్‌, ఎస్‌ఐ నబీరసూల్‌ పోటీలు ప్రారంభించారు. ఎంఈఓలు వీరన్న, మల్లికార్జున, నాయకులు నవీన, సంగప్ప, సైకిల్‌షాప్‌ హనుమంతు, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

బెళుగుప్ప(ఆంధ్రజ్యోతి): మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని గుత్తి డివిజనల్‌ విద్యాశాఖాధికారి మల్లారెడ్డి అన్నారు. మండలంలోని ఉపాధ్యాయులకు ఎర్రగుడిలో శనివారం నిర్వహించిన క్రీడా పోటీలను టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, హరికృష్ణలతో కలిసి ఆయన ప్రారంభించారు. పురుషులకు క్రికెట్‌ ఉపాధ్యాయులకు త్రోబాల్‌ పోటీలు నిర్వహించారు. హెచఎం వెంకటప్రసాద్‌, నాయకులు పాల్గొన్నారు.

కుందుర్పి(ఆంధ్రజ్యోతి): స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులకు మండల స్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీదేవి, తిప్పేస్వామి, ప్రధానోపాధ్యాయులు గోపీచంద్‌, ఉపాధ్యాయులు క్రిష్ణమూర్తి, మండల కోఆర్డినేటర్‌ వీరేష్‌, పోటీలను ప్రారంభించారు. కుందుర్పి, అపిలేపల్లి, బెస్తరపల్లి, ఎనుములదొడ్డి పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. బెస్తరపల్లి, ఎనుములదొడ్డి జట్లు ఫైనల్‌కు చేరుకోగా వ్యాయామ ఉపాధ్యాయులు పరమేశ్వర నాయకత్వంలోని ఎనుములదొడ్డి జట్టు విజయం సాధించి విన్నర్స్‌గా నిలిచింది.

కణేకల్లు(ఆంధ్రజ్యోతి): మండలంలో ఉపాధ్యాయ క్రీడా పోటీలను నిర్వహించేందుకు శనివారం ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పురుష ఉపాధ్యాయులకు క్రికెట్‌లోనూ, మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్‌ ఎంపికను నిర్వహించినట్లు ఎంఈఓలు లక్ష్మణ్ణ, భవానీశంకర్‌లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్‌, రహనాబేగం, శ్రీనివాసప్రసాద్‌ పాల్గొన్నారు.

గుంతకల్లుటౌన(ఆంధ్రజ్యోతి): గుంతకల్లు డివిజనస్ధాయి జట్టును ఎన్నుకున్నారు. స్థానిక ఎస్‌జేపీ ఉన్నత పాఠశాలలో శనివారం మండలస్ధాయి మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్‌ పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 14మందిని డివిజనస్థాయికి ఎంపిక చేశారు. ఎంఈఓలు మస్తానరావు, సుబ్బరాయుడు, హెచఎం మురళీకృష్ణ, ఎస్‌జీఎఫ్‌ కోఆర్డినేటర్‌ సత్యనారాయణ, పీఈటీలు పాల్గొన్నారు.

డీ.హీరేహాళ్‌(ఆంధ్రజ్యోతి): క్రీడలతోనే మానసిక ఉత్తేజం కలుగుతుందని మార్కెట్‌యార్డ్‌ చైర్మన హనుమంతరెడ్డి అన్నారు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో క్రీడాపోటీలను సోమలాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఎంఈఓ నరోవర్‌బాషా, ఎంపీటీసీ మొండి మల్లికార్జున, రాజశేఖర్‌, శంకర్‌, భీమలింగ, బసవరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:25 AM