Share News

collector మహిళా అభ్యున్నతే లక్ష్యం

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:29 PM

మహిళల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి శ్రీనివాస కల్యాణమండపంలో మహిళా దినోత్సవాన్ని ఎస్పీ రత్న, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

collector మహిళా అభ్యున్నతే లక్ష్యం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌ టీఎస్‌ చేతన

: కలెక్టర్‌ టీఎస్‌ చేతన

పుట్టపర్తి టౌన/రూరల్‌ మార్చి 8(ఆంధ్రజ్యోతి): మహిళల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి శ్రీనివాస కల్యాణమండపంలో మహిళా దినోత్సవాన్ని ఎస్పీ రత్న, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కుల రక్షణ కోసం అనేక చట్టాలు చేశాయని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీపం పథకం ప్రవేశపెట్టి మసిబారిన ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అనంతరం డీఆర్‌డీఏ ద్వారా మహిళా సంఘం సభ్యులకు రూ.74 కోట్ల మెగాచెక్కును అందించారు. వివిధరంగాల్లో విశేష ప్రతిభకనబరచిన మహిళలు, మహిళ ఉద్యోగులను కలెక్టర్‌, ఎస్పీ, మాజీ మంత్రి పల్లె ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ వరలక్ష్మీ, డీపీఓ సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఎంహెచఓ ఫిరోజ్‌ బేగం, మెప్మా అధ్యక్షురాలు పద్మావతి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాజేశ్వరి పాల్గొన్నారు.

బాల్యవివాహాలను వందశాతం అరికట్టాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వేడులకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భారీకేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రారంభించిన శక్తియాప్‌ మహిళల భద్రత విషయంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దానిని అందరూ డౌనలోడ్‌ చేసుకోవాలన్నారు. వారం రోజులపాటు నిర్వహించిన వారోత్సవాల పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులు అందచేశారు. సవేరా ఆసుపత్రి వైద్యురాలు విష్ణుప్రియాంక మహిళలకు ఆరోగ్యసూత్రాలను తెలియచేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయ్‌కుమార్‌, ఆదినారాయణ, శ్రీనివాసులు, సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సీఐలు సురే్‌ష,సునీత, ఇందిర పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:29 PM