sp కలిసి పనిచేద్దాం.. ప్రగతిని సాధిద్దాం: ఎస్పీ
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:09 AM
అందరం కలసికట్టుగా పనిచేసి జిల్లాలో ప్రగతిని సాదిద్దామని ఎస్పీ వీ రత్న పిలుపినిచ్చారు.
పుట్టపర్తి రూరల్, మార్చి 7 (ఆంధ్రజ్యోత)ః అందరం కలసికట్టుగా పనిచేసి జిల్లాలో ప్రగతిని సాదిద్దామని ఎస్పీ వీ రత్న పిలుపినిచ్చారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాన్ఫరెన్సు హాల్లో సిబ్బందితో కలసి కేక్‌కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మహిళా సిబ్బందికి, మహిళకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ సుజాత, సూపరెంటెండెంట్ సరస్వతి, డీపీఓ మహిళా సిబ్బంది పాల్గొన్నారు.