JC: సమష్టిగా అధిగమిద్దాం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:00 AM
జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమష్టిగా అధిగమిద్దామని జా యింట్‌కలెక్టరు శివ నారాయణశర్మ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో 2024 -25లో జిల్లాలో సంభవించే అవకాశం ఉన్న వివిధసమస్యలపై ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

అనంతపురంటౌన, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమష్టిగా అధిగమిద్దామని జా యింట్‌కలెక్టరు శివ నారాయణశర్మ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో 2024 -25లో జిల్లాలో సంభవించే అవకాశం ఉన్న వివిధసమస్యలపై ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ కరువు సంభవించి నపుడు ప్రజలను ఆసమస్యల నుంచి ఎలా సంరక్షించుకోవాలన్న అంశంపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రానున్న వేసవిలో ఏర్పడే పరిస్థితులను అధిగమించడానికి ప్రతిశాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అవసరమైనపుడు డ్రోన్ల ద్వారా కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వేసవిలో నీటివనరులు ఎండిపోయి వ్యవసాయం, తాగునీటిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. ఈసమస్యల నుంచి గట్టెక్కడానికి తగిన చర్యలు తీసుకోవాలని జేసీ సూచించారరు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఎన్డీఆర్ ఎఫ్‌సీఐ గోపాలక్రిష్ణ, వివిధశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.