MLA SUNITHA: దివ్యాంగులను ప్రోత్సహిద్దాం
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:51 PM
దివ్యాంగులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల ఎంపిక శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాప్తాడు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల ఎంపిక శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం రూరల్ మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ఇతర పాఠశాలల్లో మొత్తం 480 మంది విద్యార్థులను గుర్తించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేనరికపు వివాహాల వల్ల చాలా మంది వికలత్వంతో పుడుతున్నారన్నారు. దీని వలన వారు పడే ఇబ్బందులు వర్ణణాతీతం అన్నారు. వికలత్వం కలిగిన వారిని అవమానించకుండా ప్రోత్సహించాలన్నారు. దివ్యాంగుల కష్టాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు రూ.3 వేలు ఉన్న పింఛనను రూ.6 వేలు చేశారన్నారు. ప్రతి మండలంలో భవిత సెంటర్‌కు హాజరయ్యే దివ్యాంగ పిల్లలకు సెక్యూరిటీ అలవెన్సు కింద రూ.4 వేలు ఇస్తారన్నారు. ట్రాన్సపోర్టు అలవెన్సు గతంలో ఉండగా ప్రస్తుతం రూ.6 వేలు ఇస్తున్నారన్నారు. ప్రతి మంగళవారం దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపి, స్పీచ థెరపి, పరికరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌కు కేంద్ర హోం మంత్రి అమితషాను కలిసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వింటారని అన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, కో-ఆర్డినేటర్ కవిత, ఎంఈఓ మల్లికార్జున, సర్పంచ తిరుపాలు, కొండప్ప, సూర్యనారాయణ, శ్రీనివాసులు, సొసైటీ చైర్మన మరూరు గోపాల్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన కిష్టా, వెంకట్రాముడు, వెంకటనాయుడు పాల్గొన్నారు.