Ladies మహిళలే ఎక్కువ..!
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:42 PM
జిల్లా ఓటర్ల జాబితాను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం విడుదల చేశారు. ఏడాది నుంచి మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఎన్నికల కమిషన షెడ్యూల్ మేరకు తుది జాబితాను విడుదల చేశారు.

జిల్లాలో మొత్తం ఓటర్లు 20,22,229
పురుషులు 9,99,357
మహిళలు 10,22,625
థర్డ్ జెండర్ 247
జాబితా విడుదల చేసిన కలెక్టర్
అనంతపురం టౌన, జనవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లా ఓటర్ల జాబితాను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం విడుదల చేశారు. ఏడాది నుంచి మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఎన్నికల కమిషన షెడ్యూల్ మేరకు తుది జాబితాను విడుదల చేశారు. జిల్లాలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన, కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 20,22,229 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 9,99,357 మంది, మహిళలు 10,22,625 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 247 మంది ఉన్నారు. ఈ జాబితాను అన్ని పోలింగ్ స్టేషనలలో ప్రదర్శించాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు.
మహిళలే అధికం
జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 23,268 మంది ఎక్కువుగా ఉన్నారు. అత్యధికంగా అనంత అర్బనలో 5,917 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో గుంతకల్లులో 4,928 మంది, రాయదుర్గంలో 3,979 మంది అధికంగా ఉన్నారు.
నియోజకవర్గం పురుషులు మహిళలు థర్డ్‌జెండర్ మొత్తం
రాయదుర్గం 1,30,549 1,33,528 44 2,64,121
ఉరవకొండ 1,10,832 1,14,075 28 2,24,935
గుంతకల్ 1,33,230 1,38,158 74 2,71,462
తాడిపత్రి 1,23,466 1,25,558 26 2,49,050
శింగనమల 1,23,321 1,24,779 29 2,48,129
అనంతపురం 1,37,824 1,43,741 28 2,81,593
కళ్యాణదుర్గం 1,14,834 1,16,976 07 2,31,817
రాప్తాడు 1,25,301 1,25,810 11 2,51,122