HOSTELS: హాస్టళ్లలో పర్యవేక్షణ కొరవడింది
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:09 AM
సాంఘిక సంక్షేమ వసతి గృ హాల్లో పర్యవేక్షణ కొరవడిందని గుంతకల్లు డివిజన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స మానిటరింగ్ కమిటీ సభ్యులు హరిప్రసాద్, సాకే గో విందు అన్నారు.
గుత్తి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ వసతి గృ హాల్లో పర్యవేక్షణ కొరవడిందని గుంతకల్లు డివిజన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స మానిటరింగ్ కమిటీ సభ్యులు హరిప్రసాద్, సాకే గో విందు అన్నారు. శనివారం గుత్తిపట్టణంలోని నెంబర్1 బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. అక్కడ అధికారులు, సిబ్బంది లే కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉండడం, విద్యార్థులు గోడలు దూకి బయటకు వెళ్తున్నారన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు భద్రత కరువైందని ఈ విషయంపై సంబంధింత అధికారి బాషాను వివరణ కోరగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. ఈ వ్యవహరంపై డిప్యూటీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు.