Share News

Konda కొండలకు నిప్పు

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:41 PM

మండలంలోని చిల్లకొండయ్యపల్లి నుంచి చిల్లవారిపల్లి వరకు కునుకుంట్ల రామాపురం గ్రామాల సరిహద్దుగా ఉన్న కొండలకు మొత్తం ఆకతాయిలు శుక్రవారం నిప్పుపెట్టారు.

Konda కొండలకు నిప్పు
కొండలో కార్చిచ్చు

తాడిమర్రి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిల్లకొండయ్యపల్లి నుంచి చిల్లవారిపల్లి వరకు కునుకుంట్ల రామాపురం గ్రామాల సరిహద్దుగా ఉన్న కొండలకు మొత్తం ఆకతాయిలు శుక్రవారం నిప్పుపెట్టారు. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పూర్తీగా కాలిపోయాయి. ఈ కొండల్లో అడవిపందులు, జింకలు, కుందెళ్లు, కొండ ముచ్చులు ఎక్కువగా ఉంటాయి. కొండకు నిప్పుపెట్టడంతో అవన్నీ సజీవదహనమయ్యే ప్రమాదముంది. కొండ పైభాగం నుంచి మొదలైన మంటలు రాత్రి సమయానికి కొండవ దిగువ ప్రాంతలకు చేరుకున్నాయి. దీంతో రైతులు తమ పొలాలకు మంటలు వ్యాపించకుండా.. నానాయాతన పడుతున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 11:41 PM