Khadri Swamy నమో నారసింహా..!
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:33 PM
మాఘమాసం శనివారం సందర్భంగా పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు.

ఖాద్రీశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
కదిరి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మాఘమాసం శనివారం సందర్భంగా పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి శుక్రవారం రాత్రే ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ధ్వంజస్తంభం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు.