Share News

Khadri Hundi శ్రీవారి హుండీ ఆదాయం రూ.62.73 లక్షలు

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:35 PM

పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీలోని నగదు, కానుకలను శుక్రవారం లెక్కించినట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Khadri Hundi శ్రీవారి హుండీ ఆదాయం రూ.62.73 లక్షలు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం

కదిరి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీలోని నగదు, కానుకలను శుక్రవారం లెక్కించినట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 47 రోజులకుగాను రూ.62,73,741 ఆదాయం వచ్చిందన్నారు. 20 గ్రాముల బంగారం, 340 గ్రాముల వెండితోపాటు, 55 అమెరికన డాలర్లు కానుకలుగా వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కెనరాబ్యాంక్‌ మేనేజర్‌ అనంతబాబు, బ్యాంక్‌ సిబ్బంది, సేవాసంస్థ సభ్యులు, ఆయల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 11:35 PM