Share News

Joining TDP టీడీపీలోకి నాలుగు కుటుంబాల చేరిక

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:54 AM

బ్రహ్మసముద్రం మండలం ముద్దలాపురం గ్రామంలో వైసీపీకి చెందిన నాలుగు కుటుంబాల వారు టీడీపీలోకి చేరారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద గురువారం వారు టీడీపీ నేత ధర్మతేజ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Joining TDP టీడీపీలోకి నాలుగు కుటుంబాల చేరిక
టీడీపీలోకి చేరిన వారితో నాయకుడు ధర్మతేజ

కళ్యాణదుర్గం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): బ్రహ్మసముద్రం మండలం ముద్దలాపురం గ్రామంలో వైసీపీకి చెందిన నాలుగు కుటుంబాల వారు టీడీపీలోకి చేరారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద గురువారం వారు టీడీపీ నేత ధర్మతేజ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


వారికి ధర్మతేజ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారు మణికంఠ, లింగన్న మారుతి, గంగన్న తదితరులు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబు సీఎం అయిన ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఇందుకు ఆకర్షితులై తాము టీడీపీలోకి చేరామన్నారు. టీడీపీ ఎల్లవేళలా అండగా వుంటుందని ధర్మతేజ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, క్లస్టర్‌ ఇనచార్జి నాగరాజు , వాల్మీకి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్‌ వైపీ రమేష్‌, మాజీ జడ్పీటీసీ వెంకటేశులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 17 , 2025 | 12:54 AM