Share News

‘ప్రతిభ కనబరిస్తేనే ఉద్యోగావకాశాలు’

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:42 AM

విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పులివెందుల జేఎన్టీయూ మెకానికల్‌ విభాగాధిపతి వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. మండలంలోని హంపాపురం సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం మొద టి సంవత్సరం విద్యార్థుల కోసం ఓరియెంటేషన డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వేణుగోపాల్‌ రెడ్డి హాజరై మాట్లాడారు.

‘ప్రతిభ కనబరిస్తేనే ఉద్యోగావకాశాలు’

రాప్తాడు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పులివెందుల జేఎన్టీయూ మెకానికల్‌ విభాగాధిపతి వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. మండలంలోని హంపాపురం సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం మొద టి సంవత్సరం విద్యార్థుల కోసం ఓరియెంటేషన డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వేణుగోపాల్‌ రెడ్డి హాజరై మాట్లాడారు.


క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడితే విజయం తప్పనిసరిగా వరిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతిభ చూపిన వారికి మాత్రమే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించుకుని బాగా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెరోనిక్స్‌ కంపెనీకి చెందిన హ్యూమనాయిడ్‌ రోబోట్‌ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు వాటిని ఆసక్తిగా తిలకించి వాటితో పరస్పర చర్యల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందారు. కా ర్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్‌ వీబీఆర్‌ శర్మ, చైర్మన కృ ష్ణారెడ్డి, ఎండీ రమాకాంతరెడ్డి, ప్రిన్సిపల్‌ విష్ణువర్ధనరెడ్డి, హెచఎ్‌స విభాగాధిపతి చంద్రబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Aug 26 , 2025 | 12:42 AM