Share News

JC Cricket Tournament నేటి నుంచి జేసీ క్రికెట్‌ టోర్నీ

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:09 AM

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆధ్వర్యంలో జేసీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు.

JC Cricket Tournament నేటి నుంచి జేసీ క్రికెట్‌ టోర్నీ
మైదానాన్ని పరిశీలిస్తున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి

తాడిపత్రి, జనవరి5(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆధ్వర్యంలో జేసీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు.


ప్రతిరోజు ఉదయం 7:30గంటలకు మ్యాచ ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌ విజేతకు రూ.75వేలు, రన్నర్‌పకు రూ.50వేలు, మూడవ బహుమతిగా రూ.25వేలు నిర్వాహకులు అందించనున్నారు. మ్యాచ ప్రారంభ సమయానికి అరగంటే ముందే జట్ల సభ్యులు హాజరుకావాలని , నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులు విజ్జి, సుధీర్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు.

మైదానాన్ని పరిశీలించిన జేసీపీఆర్‌

క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహణ సందర్భంగా కళాశాల మైదానాన్ని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. పకడ్బందీగా టోర్నమెంట్‌ను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి, వారికి కావాల్సిన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఏలోపం రాకుండా టోర్నీ నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట టీడీపీ సీనియర్‌ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, పవనకుమార్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 06 , 2025 | 01:09 AM