MLC NAIDU: జగన త్వరలో జైలుకెళ్లడం ఖాయం
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:50 PM
పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహనరెడ్డి మేం అధికారంలోకి వచ్చాక సప్తసముద్రాల అవతలున్నా టీడీపీ నాయకులను, అధికారులను లాక్కొస్తానని పగటికలలు కంటున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండిపడ్డారు.
హిందూపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహనరెడ్డి మేం అధికారంలోకి వచ్చాక సప్తసముద్రాల అవతలున్నా టీడీపీ నాయకులను, అధికారులను లాక్కొస్తానని పగటికలలు కంటున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండిపడ్డారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయంవద్ద సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, నియోజకవర్గం నుంచి 10వేల మంది 10వ తేదీన అనంతపురానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు. త్వరలో జగన జైలుకెళ్లడం ఖాయమని, ఈసారి 16ఏళ్లు జైలులోనే ఉంటారన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నాయకులు జైలుకు క్యూ కడుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో 11సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అవికూడా రావన్నారు. చంద్రబాబును అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అయినా మొక్కవోని దీక్షతో ఆయన బయటకు వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15నెలల్లో ఇచ్చిన హామీలకంటే అధికంగా నెరవేర్చారన్నారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని అమలు చేస్తున్నారన్నారు. చెప్పినమాట నిలబెట్టుకున్నందుకే సూపర్‌సిక్స్, సూపర్‌హిట్ సభ నిర్వహిస్తున్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మున్సిపల్ చైర్మన రమేష్, మార్కెట్‌యార్డ్ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి, మండల కన్వీనర్లు ప్రెస్‌వెంకటేశ, హెచఎన రాము, శ్రీనివాసులు, అభిలాష్, దేమకేతేపల్లి అంజినప్ప, పరిశీలకుడు రజాక్, నాయకులు అంజినప్ప, రామాంజినమ్మ, ఎస్టీ సెల్ వెంకటరమణమ్మ, మంజునాథ్, నెట్టప్ప, అమర్నాథ్, రామాంజి, నవీన, నాగేంద్ర, డైమండ్‌బాబా పాల్గొన్నారు.