HONORING: ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:10 AM
గురుపూజోత్సవం సందర్భం గా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ చేతులమీదుగా ఉత్త మ ఉపాధ్యాయ అవార్డును మాణిక్యం మహమ్మద్ ఇషాక్ అందుకున్న విష యం తెలిసిందే.
కొత్తచెరువు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): గురుపూజోత్సవం సందర్భం గా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ చేతులమీదుగా ఉత్త మ ఉపాధ్యాయ అవార్డును మాణిక్యం మహమ్మద్ ఇషాక్ అందుకున్న విష యం తెలిసిందే. ఆయనను గురువారం మండలంలోని బండ్లపల్లి ఉన్నతపాఠశాలలో ఘనంగా సత్కరించారు. ఎంఈఓ సోమశేఖర్‌నాయుడు మా ట్లాడుతూ మహమ్మద్‌ఇషాక్ తెలుగుకవిగా పుస్తకాలు రాస్తూ సమాజ శ్రేయస్సుకోసం పాటుపడుతున్నారని కొనియాడారు. రాష్ట్ర అవార్డుతో ఇషాక్‌కు మరింతబాధ్యత పెరిగిందన్నారు. అనంతరం ఆపాస్ జిల్లా అధ్యక్షుడు అమరా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ విద్యార్థులు తనకంటే ఉన్నతస్థానంలో ఉండాలని కోరుకునే ఉపాధ్యాయుడు ఇషాక్ అన్నారు. పాఠశాల హెచఎం కడియాల మల్లికార్జున, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, శాంతి, భాస్కర్‌చంద్ర, సర్పంచ రూప్లానాయక్, నాగలక్ష్మి పాల్గొన్నారు.
తనకల్లు(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొంతపల్లి ఆదర్శప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన మారుతీ కుమార్‌ను ఎస్టీయూ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నిబద్దతతో పనిచేసే మారుతీకుమార్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఆనందించతగ్గ విషయమన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు, లక్ష్మీప్రసాద్, జాఫర్, ఎనవీఎన ప్రసాద్, శ్రీనివాసులు, జగదీష్, నాగేంద్ర, సుందర్‌సుకుమార్, మోహన, దామోదర్‌నాయుడు, రామక్రిష్ణయ్య పాల్గొన్నారు. కరువు భత్యం, మధ్యంతర భృతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.