Share News

SP RATNA: ఎస్పీకి ఆత్మీయ సత్కారం

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:52 PM

విధినిర్వహణలో వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ తమను ముందుకు నడిపిస్తున్న ఎస్పీ రత్నను పోలీసు అధికారులు, మహిళాసిబ్బంది ఘనంగా సన్మానించారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత ్సవాన్ని పురస్కరించుకుని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని శాలువాతో సత ్కరించి మెమెంటోను అందచేశారు.

SP RATNA: ఎస్పీకి ఆత్మీయ సత్కారం
DSPs, Vijay Kumar, Adinarayana honoring the SP

పుట్టపర్తి రూరల్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): విధినిర్వహణలో వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ తమను ముందుకు నడిపిస్తున్న ఎస్పీ రత్నను పోలీసు అధికారులు, మహిళాసిబ్బంది ఘనంగా సన్మానించారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత ్సవాన్ని పురస్కరించుకుని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని శాలువాతో సత ్కరించి మెమెంటోను అందచేశారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. వారంరోజులుగా జిల్లావ్యాప్తంగా జరిగిన మహిళా సాధికారత వారోత్సవాలను విజయవంతం చేయడంలో కృషి చేసిన డీఎస్పీలు విజయ్‌కుమార్‌, ఆదినారాయణ, శ్రీనివాసులు, స్పెషల్‌బ్రాంచ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్‌ఐలు వలి, మహేష్‌, సీఐలు సునీత, సురేష్‌, ఇందిర, ఆర్‌ఎ్‌సఐలు వీరన్న, ప్రదీ్‌పసింగ్‌, వెంకటేశ్వర్లును ప్రత్యేకంగా అభినందించి శాలువా మెమెంటోలతో సన్మానించారు.

Updated Date - Mar 08 , 2025 | 11:52 PM