GANESH: కోలాహలంగా వినాయకుడి నిమజ్జనం
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:52 PM
మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
రొద్దం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు. పురవీధులగుండా డీజేలతో మహిళలు, యువకులు కేరింతలు, డ్యాన్సలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. చావిడి నుంచి కెనరాబ్యాంక్ మీదుగా చిన్నయ్య టీకొట్టు సర్కిల్‌మీదుగా వైఎ్‌సఆర్‌సర్కిల్, బోయవీధి, పోలీ్‌సస్టేషనకు చేరుకున్నాయి. ట్రాన్సకో అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుంచే నిమజ్జనానికి ఆటంకం కలగకుండా విద్యుత సరఫరాను నిలిపివేశారు. ఎస్‌ఐ నరేంద్ర, సిబ్బందితో బందోబస్తు పర్యవేక్షించారు. పెద్దకోడిపల్లి గ్రామంలోని పెద్దచెరువు వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. రొద్దం జామియా మసీదు ఆధ్వర్యంలో 40కిలోల కేసిరీబాతను భక్తులకు పంపిణీ చేశారు.