Share News

road rules రోడ్డు నిబంధనలను పాటించాలి

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:56 AM

రోడ్డు భద్రతా నిబంధనలను ఆర్టీసీ డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని వెహికల్‌ ఇనస్పెక్టర్‌ ఎనవీ రాజాబాబు, ఆర్టీసీ డిపో మేనేజర్‌ కేవీ గంగాధర్‌ సూచించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో గురువారం వారు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.

 road rules రోడ్డు నిబంధనలను పాటించాలి

గుంతకల్లుటౌన, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతా నిబంధనలను ఆర్టీసీ డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని వెహికల్‌ ఇనస్పెక్టర్‌ ఎనవీ రాజాబాబు, ఆర్టీసీ డిపో మేనేజర్‌ కేవీ గంగాధర్‌ సూచించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో గురువారం వారు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు నిబంధననలు పాటిస్తూ సంవత్సరాంతం ఎలాంటి ప్ర మాదాలు జరగకుండా డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలన్నారు. డ్రైవింగ్‌ చేసేటప్పు డు సెల్‌ఫోన్లను ఉపయోగించరాదని, ఇతురులతో మాట్లాడరాదని సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని తెలిపారు. కార్యక్రమంలో గ్యారేజ్‌ ఇనచార్జి మల్లికార్జున, ఎస్‌టీఐ కృష్ణనాయక్‌, సూపర్‌వైజర్‌ చంద్రమోహన తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 17 , 2025 | 12:56 AM