Share News

RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:15 AM

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నోరకాలుగా ఆర్డీటిసంస్థ చేయూతనిచ్చిందని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలి
Dalit community leaders protesting at Ambedkar Circle

రొద్దం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నోరకాలుగా ఆర్డీటిసంస్థ చేయూతనిచ్చిందని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళితులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఎంతో మంది పేదలకోసం ఇళ్లు, ఆరోగ్యం, చదువుకు అయ్యే ఖర్చు, ఆర్డీటీ భరించిందన్నారు. అలాంటి సంస్థ నేడు ఆర్థిక లావాదేవీలు లేక మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతీసుకుని ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలన్నారు. తహసీల్దార్‌ ఉదయ్‌శంకర్‌రాజుకు వారు వినతిపత్రం అందించారు. నరేష్‌, గోపాల్‌, అంజి, గోపాల్‌, దుర్గా, జయప్ప, మహిళలు పాల్గొన్నారు.

పెనుకొండ: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని డీవీఎంసీ మాజీ సభ్యులు ఎంఎన మూర్తి ఆధ్వర్యంలో దళిత, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ట్రేడ్‌ యూనియన నాయకులతో కలిసి పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. దళిత సంఘం నాయకులు పెద్దన్న, నాగరాజు, నరసింహులు, అనీల్‌, లక్ష్మీనారాయణ, హెచఆర్‌పీసీఐ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు గంగులయ్య, కిష్టప్ప, శంకరప్ప, శివన్న, హరికుమార్‌, మల్లికార్జున, మమ్మద్‌ హుస్సేన, రియాజ్‌, అయాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 12:15 AM