RDT ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ చేయాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:26 AM
ఉమ్మడి అనంతజిల్లాలో పేదలకు అనేక సేవలు అందిస్తున్న ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని ఆర్డీటీ అభిమాన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
అనంతపురంరూరల్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంతజిల్లాలో పేదలకు అనేక సేవలు అందిస్తున్న ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని ఆర్డీటీ అభిమాన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం అనంతపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాచానపల్లి సుబ్రమణ్యం, చిన్నకుంట నారాయణ, ఎన.ఎన.కుంట తిరుపాలు, రామాంజనేయులు, పెద్దక్క, మన్నీల గోపాల్, తేజ, వెంకటరాముడు, నల్లప్ప, భీమన్న, శ్రీరాములు, తనుజా, జ్యోతి, డేవిడ్, సుష్మ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..