MLA KANDIKUNTA: ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:09 AM
ప్రజాసమస్యల పరిష్కారినికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు.
కదిరి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారినికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 4, 5, 6, 7, 8, 31 వార్డుల్లో ఉండే ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ఏదో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమన్నారు. గతవారం సత్యసాయిబాబా జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించలేదన్నారు. ఇందుకు ఎమ్మెల్యేనైన తనకే ప్రభుత్వం షోకాజ్ నోటీసు పంపిందిందన్నారు. ప్రజాదర్బార్ పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధవహిస్తుందో అర్థమవుతోందన్నారు. ఇక్కడ కేవలం సమస్యలు తెలుసుకోవడమేకాకుండా వాటి పరిష్కారానికి జవాబుదారి తనంగా ఉంటామన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనలకు, గత ప్రభుత్వ ఆలోచనలకు స్పష్టమైన తేడా ఉందన్నారు. కార్యక్రమానికి 472 అర్జీలు రాగా, అం దులో ఇళ్లకోసం 382, పింఛన్లకు 90 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన డైరెక్టర్ పర్వీనబాను, మున్సిపల్ చైర్‌పర్సన దిల్షాదున్నీసా, వైస్ చైర్మన రాజశేఖరాచారి, కౌన్సిలర్ కిన్నెర కల్యాణ్, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, తహసీల్దార్ మురళీక్రిష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కందికుంట ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.