Share News

TRANSFORMER: గుంజేపల్లి ఫీడర్‌కు గ్రహణం

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:40 AM

మండల కేంద్రంలోని విద్యుత సబ్‌స్టేషనలో గుంజేపల్లి ఫీడర్‌కు గ్రహణం పట్టింది. చిన్న చినుకు పడ్డా, గాలి వీచినా విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. బ్రేకర్‌లు ట్రిప్‌ కావడంతో విద్యుత సమస్య అధికమవుతోంది.

TRANSFORMER: గుంజేపల్లి  ఫీడర్‌కు గ్రహణం
గుంజేపల్లి విద్యుత ఫీడర్‌

ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులు

పట్టించుకోని అధికారులు

ముదిగుబ్బ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని విద్యుత సబ్‌స్టేషనలో గుంజేపల్లి ఫీడర్‌కు గ్రహణం పట్టింది. చిన్న చినుకు పడ్డా, గాలి వీచినా విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. బ్రేకర్‌లు ట్రిప్‌ కావడంతో విద్యుత సమస్య అధికమవుతోంది. గుంజేపల్లి ఫీడర్‌ కింద గుంజేపల్లి, పొడరాళ్లపల్లి, రామస్వామి తండా, పూజారి తండా, మంగళమడక, ముదిగుబ్బ పాతవూరు, గుడ్డంపల్లి తండాలలో విద్యుత అంతరాయాలు ఏర్పడుతున్నాయని, సంబంధిత గ్రామాల రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాలకొకసారి బ్రేకర్లు ట్రిప్‌ అవుతున్నాయని, ఎక్కడైనా జంపర్‌ కట్‌ అయినా, ఏదైనా విద్యుత అంతరాయం ఏర్పడినా సబ్‌స్టేషన నంబర్‌కు ఫోన చేస్తే స్విచ ఆఫ్‌ వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ఒకవేళ ఫోన పనిచేసినా ఫోన తీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైనమెనలు ఎంతమంది ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఫ 10 నిమిషాలకొకసారి పవర్‌ కట్‌ అయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యుత అప్‌ అండ్‌ డౌన కావడంతో ఎలకి్ట్రకల్‌ పరికరాలు పాడవుతున్నాయని అంటున్నారు. వినియోగదారులు కదిరిలోని ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా తూతూ మంత్రంగానే మరమ్మతు చేయించి చేతులు దులుపుకుంటున్నారని అంటున్నారు. ఎన్నో మార్లు జాతీయ రహదారిపై, విద్యుత సబ్‌స్టేషన ఎదుట రైతులు ధర్నాలు చేసినా అప్పటికి అరకొర మరమ్మతు చేస్తున్నారని వాపోతున్నారు. అనంతరం షరా మామూలే అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదురోజుల నుంచి వర్షాలు అధికంగా కురవడంతో రాత్రి సమయాలలో పూర్తిగా విద్యుత సరఫరా నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యుత అంతరాయం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, గుంజేపల్లి ఫీడర్‌ పరిధిలోని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతోనే సమస్య

-శివతేజ, ఏఈఈ, ముదిగుబ్బ

గుంజేపల్లి ఫీడర్‌ కింద వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉండడంతో తరచూ విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. ఆర్డీఎ్‌సఎస్‌ లైన పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తి అయితే విద్యుత సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.

విద్యుత సమస్యను పరిష్కరించండి

వర్షాకాలం కావడంతో తీవ్ర విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. ఐదురోజులుగా రాత్రి వేళల్లో విద్యుత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కదిరి విద్యుత అధికారులు దృష్టికి పలు మార్లు తీసుకువెళ్లినా స్పందించడం లేదు. విద్యుత సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.

- సోమల ప్రకాష్‌ నాయుడు, ముదిగుబ్బ

ఆందోళనలు చేసినా స్పందించడం లేదు

విద్యుత సమస్యపై ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా సంబంధిత పైస్థాయి అధికారులు స్పం దించడంలేదు. మండలంలో విద్యుత సమస్యలు అధికమయ్యాయి. గుంజేపల్లి ఫీడర్‌లో తరచూ విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు స్పందించి బ్రేకర్లు మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలి. - చల్లా శ్రీనివాసులు, సీపీఐ మండల కార్యదర్శి

Updated Date - Aug 11 , 2025 | 12:40 AM