Donate blood రక్తదానం చేసి.. ప్రాణదాతలు కండి
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:30 AM
టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరంలో దాతలు విరివిగా పాల్గొనాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

రాయదుర్గం, జనవరి 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరంలో దాతలు విరివిగా పాల్గొనాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
పట్టణంలోని తన స్వగృహంలో బుధవారం ఆయన టీడీపీ పట్టణ నాయకులు, వార్డు ఇనచార్జిలతో సమావేశం నిర్వహించి మాట్లాడా రు. ఈనెల 18వ తేదీన రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయస్వామి కళ్యాణమంటపంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో దాతల నుంచి 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అందులో 400 యూనిట్లు ఎనటీఆర్ ట్రస్టుకు, మరో వంద యూనిట్లు బళ్లారిలోని ప్రభుత్వ వైద్యశాలకు అందిస్తామన్నారు. శిబిరంలో దాతలు విరివిగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..