JC : బలవంతం వద్దు
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:59 AM
బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ఎవరినీ బలవంతం చేయవద్దని జిల్లా ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ సూచించారు. మంగళవారం జేసీ క్యాంపు ఆఫీస్ నుంచి ఉపాధి హామీ పథకం, పీ4 సర్వే, పంచాయతీ, మున్సిపల్ సెక్టార్, గ్రామ/వార్డు సచివాలయం ద్వారా చేపడుతున్నఅంశాలపై ...
స్వచ్ఛందంగా వచ్చిన వారే మార్గదర్శులు
ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ
అనంతపురం కలెక్టరేట్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ఎవరినీ బలవంతం చేయవద్దని జిల్లా ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ సూచించారు. మంగళవారం జేసీ క్యాంపు ఆఫీస్ నుంచి ఉపాధి హామీ పథకం, పీ4 సర్వే, పంచాయతీ, మున్సిపల్ సెక్టార్, గ్రామ/వార్డు సచివాలయం ద్వారా చేపడుతున్నఅంశాలపై ఆయన జూమ్ కాన్ఫరెన్స ద్వారా అధికారులతో సమీక్షించారు. ఇనచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ బంగారు కుటుంబాల విషయంలో స్వచ్ఛందంగా వచ్చిన వారే మార్గదర్శులన్నారు. బంగారు కుటుంబాలకు సంబంధించి సర్వే పూర్తి చేయాలని, సర్వే పూర్తయిన గ్రామాల్లో బంగారు కుటుంబాల మార్గదర్శులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బంగారు కుటుంబాలు పెంచడానికి నియోజకవర్గ కేంద్రాల్లోని ఎంపీడీఓలు, స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పీఆర్ 1 ఆప్ ద్వారా ప్రతిరోజు 4అంశాలకు సంబంధించి రిపోర్టులు అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రతిరోజు ఇంటింటి నుంచి వందశాతం చెత్త సేకరించే విషయంపై పంచాయతీ సెక్రటరీలు దృష్టి సారించాలన్నారు. ప్రతి 15రోజులకోసారి ఓవర్ హెడ్ టాంక్స్ క్లీనింగ్ చేసి క్లోరినేషన చేయాలని, పైపులు లీకేజీ లేకుండా చూడాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయించి తల్లికి వందనం డబ్బు లబ్ధిదారుల ఖాతాకు జమ అయ్యేలా చూడాలన్నారు.