AGGITATION: పేదలకు న్యాయం చేయండి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:12 AM
మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ స్థలంలో నివాసమున్న పేదలకు న్యాయం చేయాలని తహసీల్దార్ మారుతికి సోమవారం కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు.
గోరంట్ల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ స్థలంలో నివాసమున్న పేదలకు న్యాయం చేయాలని తహసీల్దార్ మారుతికి సోమవారం కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెండేళ్లుగా నివాస స్థలాలకు అనుభవ హక్కు పత్రాలు ఇవ్వాలని అడుగుతున్నా పట్టించుకోలేదన్నారు. వీఆర్‌ఓ రమేష్ పేదల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో నంబర్ 30, 28లను అమలు చేసి, పేదలకు న్యాయం చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రఽధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, స్వర్ణలత, వెంకటేష్, ఆంజనాదేవి, ఆంజనేయులు, భాస్కర్, అచ్చమ్మ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.