Share News

తవ్వారు.. వదిలేశారు..

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:06 AM

కళ్యాణదుర్గం నుంచి తిప్పనపల్లి వెళ్లే ప్రధాన రహదారిని అయ్యగార్లపల్లి వద్ద మరమ్మతుల పేరిట రోడ్డు కొద్దిమేర తవ్వారు. ఆ తర్వాత మరమ్మతులు చేయడం మరిచారు. దీంతో ఆ ప్రాంతంలోకి రాగానే వాహనచోదకులు అసౌకర్యానికి గురవుతున్నారు.

తవ్వారు.. వదిలేశారు..
రోడ్డును తవ్వి వదిలేసిన దృశ్యం

శెట్టూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కళ్యాణదుర్గం నుంచి తిప్పనపల్లి వెళ్లే ప్రధాన రహదారిని అయ్యగార్లపల్లి వద్ద మరమ్మతుల పేరిట రోడ్డు కొద్దిమేర తవ్వారు. ఆ తర్వాత మరమ్మతులు చేయడం మరిచారు. దీంతో ఆ ప్రాంతంలోకి రాగానే వాహనచోదకులు అసౌకర్యానికి గురవుతున్నారు.


ఆర్‌అండ్‌బీ అధికారులు నెలరోజుల క్రితం రోడ్డును మరమ్మతుల పేరిట జేసీబీతో కొద్దిమేర తవ్వారు. ఆ తర్వాత మరమ్మతులు చేయకుండా అలాగే ఉంచేశారు. దీనివల్ల తొలగించిన చోట ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో ఏమరుపాటుగా ఉంటే ప్రమాదానికి గురికావాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదన్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 06 , 2025 | 01:06 AM