Share News

Current కరెంటు కష్టాలు తీరుతాయ్‌..!

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:37 PM

ప్రజల సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి-ఏబీఎన చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సత్ఫలితాలను ఇస్తోంది.

Current కరెంటు కష్టాలు తీరుతాయ్‌..!
బీసీ కాలనీలో విద్యుత లైన ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

బీసీ కాలనీలో విద్యుత శాఖ అధికారుల పర్యటన

స్తంభాలు, లైన, ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటుకు నివేదిక తయారీ

ఇళ్లపై ఉన్న 33 కేవీ లైన మార్చేందుకు సైతం..

కొత్తచెరువు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి-ఏబీఎన చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సత్ఫలితాలను ఇస్తోంది. కొత్తచెరువు బీసీ కాలనీ ప్రజల కోసం జనవరి 28 నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొన్న విషయం తెలిసిందే. కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రజలు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. పరిష్కారానికి అధికారులు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటికే డ్రైనేజీ సమస్య పరిష్కారమైంది. తాజాగా విద్యుత సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. బీసీ కాలనీ, ఎన్టీఆర్‌ నగర్‌, వేణుగోపాల్‌ నగర్‌లోని ఎల్‌-1,2,3,4 ప్రాంతాలలో విద్యుత స్తంభాల ఏర్పాటుకు అంచనాలను తయారు చేశారు. కాలనీలలో రెండు రోజులపాటు పర్యటించి, ఎన్ని స్తంభాలు అవసరమో, ఎంత ఖర్చు అవుతుందో గుర్తించారు. విద్యుత లైన, స్తంభాలు, ట్రాన్సఫార్మర్‌ల ఏర్పాటుకు ఎన్టీఆర్‌ కాలనీకి రూ.3.61 లక్షలు, బీసీ కాలనీకి రూ.3.45 లక్షలు, ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని ఎల్‌-3 కాలనీకి రూ.2.94లక్షలు, పాత బీసీకాలనీకి రూ.2.94 లక్షలు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన తయారు చేశారు. ఇళ్లపై వెళ్తున్న 33 కేవీ హైటెన్షన లైన మార్పునకు రూ.8 లక్షలు అవుతుందని అంచనా వేశారు. నివేదికను ఎమ్మెల్యేకి అందజేస్తామని, డీడీలు చెల్లించగానే పని పూర్తి చేస్తామని ట్రాన్సకో ఏఈ వెంకటేశ నాయక్‌ తెలిపారు. ఎల్‌ఐలు రవి, కేశవ, టౌన కన్వీనర్‌ ఒలిపి శీనతో కలిసి ఆయన కాలనీలో పర్యటించారు.

Updated Date - Feb 08 , 2025 | 11:37 PM