Crime review పేకాటకు చెక్ పెట్టండి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:35 PM
పేకాటకు అడ్డుకట్ట వేయాలని జల్లా ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఆమె మాట్లాడుతూ గ్రేవ్, నానగ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, పోక్సో, మర్డర్, చోరీ కేసుల గురించి ఆరాతీశారు.

సరిహద్దుల్లో నిరంతరం నిఘా ఉండాలి
నేర సమీక్షలో ఎస్పీ వి.రత్న
పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): పేకాటకు అడ్డుకట్ట వేయాలని జల్లా ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఆమె మాట్లాడుతూ గ్రేవ్, నానగ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, పోక్సో, మర్డర్, చోరీ కేసుల గురించి ఆరాతీశారు. అరెస్టయిన నిందితులపై త్వరగా చార్జ్‌షీట్ వేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు వాహనాల తనిఖీ ఉండాలని, బోర్డర్ చెక్‌పోస్టులలో నిరంతర నిఘా ఉంచి, పక్కరాషా్ట్రల నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మహిళపై అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలు, రాజకీయ సమస్యలు వంటివాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఈసాక్షి యాప్, డీజీలాకర్‌యాప్ గురించి అధికారులకు వివరించారు. డ్రోన, సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచి ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకోవాలన్నారు. పేకాట, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటివాటిపై ప్రత్యేక నిఘా ఉంచి వాటికి అడ్డుకట్టవేయాలన్నారు. రాత్రివేళల్లో గస్తీ, గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరాతీసి నేరాలు జరుగుకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయ్‌కుమార్, మహే్‌ష, హేమంతకుమార్, ఆదినారాయణ, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, సైబర్ సెల్ సీఐ తిమ్మారెడ్డి, ఎస్బీ ఎస్సై ప్రదీ్‌పకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.