Share News

DLSA: ఇబ్బందులుంటే సంప్రదించండి

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:59 PM

జనన, కుల, వివాహ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో న్యాయపరమైన ఇబ్బందులుంటే న్యాయసేవ అధికార సంస్థలను సంప్రదించాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌ యాదవ్‌ సూచించారు.

DLSA: ఇబ్బందులుంటే సంప్రదించండి
Speaking Shivprasad Yadav

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జనన, కుల, వివాహ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో న్యాయపరమైన ఇబ్బందులుంటే న్యాయసేవ అధికార సంస్థలను సంప్రదించాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌ యాదవ్‌ సూచించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్‌, పంచాయతీ వార్డు అడ్మిన్లు, రిజిస్ర్టార్‌ కార్యాలయ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంలో ఆలస్యం లేకుండా త్వరితగతిన అవసరమైన వారికి అందజేయడానికి ఉన్న పరిస్థితులను వివరించారు. అనంతరం శాశ్వత లోక్‌ అదాలత చైర్మన శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉన్న శాశ్వత లోక్‌ అదాలత వలన న్యాయపరమైన పరిష్కార మార్గాలను వివరించారు. కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స కౌన్సిల్‌ ఇటికే నల్లప్ప, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 11:59 PM