COMMISSIONER: నకిలీ జాబ్‌కార్డులపై కమిషనర్ సీరియస్
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:08 AM
జాతీయ ఉపాఽధి పథకంలో నకిలీ జాబ్‌కార్డుల వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ సీరియస్ అయ్యారు. ఇటీవల ఉపాధి పథకంలో నకిలీ జా బ్‌కార్డులతో సొమ్ము కొల్లకొడుతున్న విషయంపై ఆంరఽధజ్యోతిలో కథనాలు ప్రచురితమయ్యాయి.
పుట్టపర్తి టౌన, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాఽధి పథకంలో నకిలీ జాబ్‌కార్డుల వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ సీరియస్ అయ్యారు. ఇటీవల ఉపాధి పథకంలో నకిలీ జా బ్‌కార్డులతో సొమ్ము కొల్లకొడుతున్న విషయంపై ఆంరఽధజ్యోతిలో కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన కమిషనర్ నకిలీ జాబ్‌కార్డుల ఏరివేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని నకిలీ జాబ్‌కార్డులపై విచారణచేసి, సమగ్ర నివేదిక అందించాలని ఏపీఎ్‌సఎ్‌సఏఏటీ డైరెక్టర్‌కు సూచించారు. ఇప్పటివరకు నకిలీ జాబ్‌కార్డుదారులకు ఎంత చెల్లించింది. ఎంత రికవరీ చేసింది. ఇందుకు బాధ్యులు ఎవరన్న విషయంపై సమగ్రంగా విచారించి నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి, నకిలీ జాబ్‌కార్డుదారుల గురించి విచారించాలని తెలిపారు.