TDP: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:28 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని అమ లు చేసిందని ఎమ్మెల్యే తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు. పట్టణంలో శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.
గుత్తి,అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని అమ లు చేసిందని ఎమ్మెల్యే తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు. పట్టణంలో శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ పరిధిలో 258మంది గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి ఈ పథకం అమలైందన్నారు. 516 మంది ఆటో డ్రైవర్లకు రూ.77.40 లక్షలను ఒక్కొక్క డ్రైవర్‌కు రూ.15 వేలు వారి ఖాతాలో జమఅవుతాయన్నారు. అనంతరం గాంధీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బార్‌మీయా, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, మా ర్కెట్ యార్డు చైర్మన సూర్యప్రతాప్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యు డు చికెన శ్రీనివాసులు, న్యాయవాది సోమశేఖర్, రమేష్, ఇలియాజ్, ప్రసాద్, అబ్దుల్‌వాహబ్, రామకృష్ణ, సునీత, ఈశ్వరయ్య పాల్గొన్నారు.
ఉరవకొండ (ఆంధ్రజ్యోతి): మండల పరిషత కార్యాలయ ఆవరణలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని టీడీపీ నాయకులు, అధికారులు ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 808 మందికి రూ.1.21 కోట్లు జమ చేశామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు మెగా చెక్కును అదించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని టీడీపీ బీసీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య, ఏఎంసీ మాజీ చైర్మన రేగాటి నాగరాజు అన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ ఎనఫోర్స్‌మెంట్ అధికారి మనోహర్ రెడ్డి, తహసీల్దార్ మహబూబ్ బాషా, ఇనచార్జి ఎంపీడీవో శంకర్, టీడీపీ మండల కన్వీనర్లు నూతేటి వెంకటేశులు, బీడీ మారయ్య, మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, టీడీపీ నాయకులు ప్యారం కేశవానంద, తిమ్మప్ప, నాగేంద్ర, నాగభూషణం, దేవేంద్ర, మురళి, వలి, గోవిందు పాల్గొన్నారు.