women's power స్త్రీ శక్తి అమలుపై సంబరాలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:23 AM
ప్రభుత్వం స్ర్తీశక్తి పథకాన్ని అమలు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని న్యామద్దల గ్రామంలో డ్వాక్రామహిళలు, టీడీపీ నాయకులు సోమవారం సంబరాలు నిర్వహించారు.
చెన్నేకొత్తపల్లి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం స్ర్తీశక్తి పథకాన్ని అమలు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని న్యామద్దల గ్రామంలో డ్వాక్రామహిళలు, టీడీపీ నాయకులు సోమవారం సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, ఎమ్మెల్యే పరిటాలసునీత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలుగు మహిళ విజయమ్మ, డ్వాక్రా మహిళలు భాగ్యలక్ష్మీ, శాంతి, శిరీష, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..