నెలలోపే బిల్లులు అప్‌లోడ్ చేయాలి
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:29 AM
ల్లాలో రహదారుల పనులు పూర్తయ్యాక బిల్లులు నెలలోపు ఆనలైనలో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలనీ, నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఎంఎ్‌సఐడీసీ, సమగ్రశిక్ష, హౌసింగ్, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఆయా శాఖల పరిధిలో చేపడుతు...
కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం కలెక్టరేట్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారుల పనులు పూర్తయ్యాక బిల్లులు నెలలోపు ఆనలైనలో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలనీ, నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఎంఎ్‌సఐడీసీ, సమగ్రశిక్ష, హౌసింగ్, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న వివిధ రకాల పనుల్లో సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయ్యాక నెల రోజులకు ఒక్క బిల్లు కూడా పెండింగ్ ఉండటానికి వీలు లేదన్నారు. నెలకోసారి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. వచ్చే నెలకు సంబంధించి ఆర్‌అండ్‌బీ పరిధిలో లక్ష్యం నిర్ధేశించుకుని రహదారుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎంశ్రీ పాఠశాలల్లో అభివృద్ది పనులు చేపట్టేందుకు మాస్టర్‌ప్లాన తయారు చేయాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మురళీకృష్ణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సురేష్, పీఆర్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, హౌసింగ్ పీడీ శైలజ, ఎనహెచ పీడీ తరుణ్, పబ్లిక్ హెల్త్ ఈఈ ఆదినారాయణ పాల్గొన్నారు.
పథకాలు పేదలకు చేరాలి
కలెక్టర్ ఆనంద్
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ చేరేలా చూడాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహార్‌తో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండేలా చూడాలని ఆదేశించారు. పోషన అభియాన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. భూమి కోసం దరఖాస్తు చేసుకున్న 35 మంది మాజీ సైనికులకు అర్హత మేరకు సాగు భూమి పట్టాలు ఇస్తామని తెలిపారు. మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు తెలపాలని సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్లనే మరమ్మతు చేయించాలని సూచించారు. పీఎంశ్రీ అమలు కోసం 44 పాఠశాలల మాస్టర్ ప్లాన సత్వరమే తయారు చేయాలని ఆదేశించారు. మరమ్మతులు చేయాల్సిన, శిథిలావస్థలో ఉన్న పాఠశాలల గదుల్లో తరగతులు నిర్వహించవద్దని హెచ్చరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో పాల్ ట్యాబ్‌ల వినియోగ సమయం ఎక్కువగా ఉండేలా చూడాలని, తద్వారా విజ్ఞానం పెరుగుతుందని అన్నారు. పోషకాహార లోపంతో ఉన్న మాల్ న్యూట్రిషన పిల్లలు, బరువు తక్కువ గల పిల్లల వివరాలు, వారికి అందిస్తున్న సపోర్ట్, తీసుకోవాల్సిన చర్యలు, ప్రోగ్రెస్ గురించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. సమీక్షలో డీఈఓ ప్రసాద్ బాబు, సమగ్ర శిక్ష ఏసీపీ శైలజ, జిల్లా బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారిణి కుష్బూకొఠారి తదితరులు పాల్గొన్నారు.