LAND DONETOR : ఊరికి ఉపకారి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:27 AM
పెనుకొండ న గర పంచాయతీ నుంచి కోనాపురం వెళ్లే దారి కోసం రూ.2కోట్లు విలువ చేసే భూమిని కోగిర జయచంద్ర వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
పెనుకొండ రూరల్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): పెనుకొండ న గర పంచాయతీ నుంచి కోనాపురం వెళ్లే దారి కోసం రూ.2కోట్లు విలువ చేసే భూమిని కోగిర జయచంద్ర వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. పెనుకొండ నుంచి మడకశిరకు వెళ్లే రోడ్డు, నారాయణమ్మ కాలనీ, కోనాపురం, మంగాపురం, పరిటాల డిగ్రీకళాశాలకు వెళ్లే రహదారి 20అడుగులు మాత్రమే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కోగిర జయచంద్ర తమ వ్యవసాయ పొలంలో నారాయణమ్మ కాలనీ వద్ద పది సెంట్ల భూమిని రోడ్డుకోసం వితరణ చేశారు. ఇక్కడ సెంటు దాదాపు రూ.20లక్షలు పలుకుతోంది. దీంతో నగర పంచాయతీ అధికారులు పెనుకొండ-కోనాపురం రోడ్డులో రూ.84లక్షలతో డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. స్థలదాత కోగిర జయచంద్రను మంత్రి సవిత తన క్యాంపు కార్యాలయంలో సత్కరించారు.