Sankranti అంబరాన్నంటిన.. సంక్రాంతి సంబరం..
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:25 AM
సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రజలు మంగళవారం అంత్యంత వైభవంగా పండుగను జరిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో సైతం వేకువజామునే మహిళలు ఇళ్ల ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేశారు.

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్: సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రజలు మంగళవారం అంత్యంత వైభవంగా పండుగను జరిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో సైతం వేకువజామునే మహిళలు ఇళ్ల ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేశారు.
ఇళ్లను తోరణాలు, పూలతో అలంకరించారు. ముగ్గులలో గొబ్బెమ్మలను ఉంచి పూజలు చేశారు. తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. రకరకాల పిండివంటలు చేసి బంధుమిత్రులను ఆహ్వానించారు. బంధువుల రాకతో ఇళ్లన్నీ కళకళలాడాయి. హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు వీధివీధి తిరుగుతూ భిక్షాటన చేశారు. పలు గ్రామాల్లో యువత వివిధ ఆటల పోటీలు నిర్వహించి సందడి చేశారు. అలాగే మహిళలకు ముగ్గులు పోటీలు జరిపి విజేతలకు బహుమతులు అందించారు. ఇంకొన్ని గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక బుధవారం కనుమను పురస్కరించుకుని గ్రామాల్లో రైతులు పాడి పశువులకు పూజలు చేశారు. పండుగు సందర్భంగా ఆలయాల్లోనూ అర్చకులు మూలవిరాట్‌లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..