శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు భూమి కేటాయించండి
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:34 AM
లక్ష్మీనరసింహస్వామి కొండపై శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు ఎకరం భూమి కేటాయించాలని బలిజ కులస్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీకృష్ణదేవరాయల 516పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
పెనుకొండ టౌన, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): లక్ష్మీనరసింహస్వామి కొండపై శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు ఎకరం భూమి కేటాయించాలని బలిజ కులస్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీకృష్ణదేవరాయల 516పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం 44వ జాతీయరహదారివద్ద ఉన్న 50అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ విగ్రహానికి పూలమాలలువేసి నివాళి ర్పించారు. వారుమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది కృష్ణదేవరాయల జయంతిని ఘనంగా నిర్వహించాలని, కొండపై భూమి కేటాయించాలని డిమాండ్ చేవారు. పట్టణ అధ్యక్షుడు సూరి, ప్రగతి శ్రీనివాసులు, బాలాజీ, రమేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.