సామాజిక న్యాయానికి పాతర
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:33 AM
దేశంలో సామాజిక న్యాయానికి పాతర వేశారనీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీలపె దాడులు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర నేత జగదీష్ పేర్కొన్నారు. దాడులను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో ...
జనగణనతోపాటు కులగణన చేపట్టాలి
సీపీఐ నేత జగదీష్ డిమాండ్
అనంతపురం విద్య, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): దేశంలో సామాజిక న్యాయానికి పాతర వేశారనీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీలపె దాడులు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర నేత జగదీష్ పేర్కొన్నారు. దాడులను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో సీపీఐ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్‌క్లాక్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించారు. అక్కడ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. జగదీష్ మాట్లాడుతూ.. దళిత, గిరిజన, ఆదివాసీలు, మహిళలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. జనగణనతోపాటే కులగణన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేత జాఫర్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు పాల్గొన్నారు.