Share News

GRIEVENCE: ఫిర్యాదుల వెల్లువ

ABN , Publish Date - Jan 21 , 2025 | 12:24 AM

స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏకంగా 251 వినతులు వచ్చాయి. వాటిని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ స్వీకరించారు.

GRIEVENCE: ఫిర్యాదుల వెల్లువ
JC Abhishek Kumar receiving complaints

పుట్టపర్తిటౌన, జనవరి20(ఆంధ్రజ్యోతి): స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏకంగా 251 వినతులు వచ్చాయి. వాటిని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పట్ల శ్రద్ధ చూపి, సకాలంలో పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్‌ భూముల పరిశీలనను వేగవంతం చేయాలని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి సంబంధించిన పోస్టర్లను జేసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో విజయసారధి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

డీపీఓలో..

పుట్టపర్తిరూరల్‌: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 65 ఫిర్యాదులు అందాయి. వాటిని ఎస్పీ రతన్న స్వీకరించారు. సంబంధిత పోలీసు అదికారులతో ఫోనలో మాట్లాడి చట్టపరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2025 | 12:24 AM