Share News

VIDYUTH: నెరవేరిన దశాబ్దాల కల..!

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:54 PM

లింగనపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల సమస్య పరిష్కారమయ్యింది. ప్రజలు విద్యుత సమస్యతో సత్తమయ్యేవారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంతోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు.

VIDYUTH: నెరవేరిన దశాబ్దాల కల..!
Officials installing electricity poles in fields (File)

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

రాప్తాడు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): లింగనపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల సమస్య పరిష్కారమయ్యింది. ప్రజలు విద్యుత సమస్యతో సత్తమయ్యేవారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంతోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బొమ్మేపర్తి పంచాయతీ లింగనపల్లి గ్రామంలో ఇళ్లపైన 11 కేవీ విద్యుత తీగలను పొలాలకు సరఫరా చేశారు. ఇళ్లపైన తీగలు ఉండటంతో ప్రజలు భయాందోళన చెందేవారు. కొంత మంది ప్రమాదాల బారిన పడి గాయపడిన సంఘటనలు ఉన్నాయి. ఇళ్లపైన ప్రమాదకరంగా ఉన్న విద్యుత తీగలను మార్చాలని గ్రామస్థులు పలుమార్లు విన్నవించినా ఏ అధికారి, రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో పరిటాల సునీత, మండల ఇనచార్జి ధర్మవరపు మురళి లింగనపల్లి గ్రామానికి వచ్చినప్పుడు సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే పరిటాల సునీత విద్యుత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇళ్లపై ఉన్న 11 కేవీ విద్యుత తీగలను తొలగించి పొలాల్లో అమర్చారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఎమ్మెల్యే చొరవతోనే సమస్య పరిష్కారం

గ్రామంలో ఇళ్లపైన 11 కేవీ విద్యుత తీగలు ప్రమాదకరంగా ఉండటంతో గ్రామస్థులు నిత్యం భయాందోళన చెందేవారు. విద్యుత ప్రమాదాలతో కొంత మంది గాయపడ్డారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవతోనే సమస్య పరిష్కారమైంది.

- సూర్యనారాయణరెడ్డి, లింగనపల్లి

మా ఇంటిపై విద్యుత తీగలు ఉండేవి

మా ఇంటిపై 11 కేవీ విద్యుత తీగలు ఏళ్ల నుంచి ఉండేవి. ఇంటిపైకి వెళ్లాలంటే భయం భయంగా ఉండేది. వానా కాలం గాలికాలం ఏ ప్రమాదం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురయ్యేవారం. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్య పరిష్కారమైంది. - అశోక్‌రెడ్డి, లింగనపల్లి

Updated Date - Aug 28 , 2025 | 11:55 PM