Share News

MLA DAGGUPATI: అరచేతిలో అందుబాటులోకి 161 సేవలు

ABN , Publish Date - Feb 02 , 2025 | 12:03 AM

కూటమి ప్రభుత్వంలో అరచేతిలోనే 161 సేవలు అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు.

MLA DAGGUPATI: అరచేతిలో అందుబాటులోకి 161 సేవలు
An MLA giving alms to the Naralokesha cutout at the Brahmangari temple

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో అరచేతిలోనే 161 సేవలు అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. శనివారం స్థానిక పాతూరు బ్రహ్మంగారి ఆలయం వద్ద పద్మశాలి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్‌ పోతుల లక్ష్మీనరసింహులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నారాలోకేశ భారీ కటౌట్‌కు ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. రాణి నగర్‌లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో లోకేశ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాయల్‌ మురళీ, పోతుల లక్ష్మీనరసింహలు, కుంచెపు వెంకటేష్‌, గుర్రం నాగభూషణం, పరమేశ్వరన, కడియాల కొండన్న పాల్గొన్నారు.

మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. మండలంలోని రుద్రంపేట పంచాయతీలో గ్రామ సంఘం కార్యాలయంలో రూడ్‌ సెట్‌ ఆధ్వర్యంలో మహిళలకు జూట్‌ బ్యాగుల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఎంపీడీఓ దివాకర్‌, ఈఓఆర్డీవెంకటనాయుడు, పంచాయితీ కార్యదర్శి హిదయతుల్లా, ఏరియా కో ఆర్డీనేటర్‌ సుభద్ర పాల్గొన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం మాది: ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం తమదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. శనివారం స్థానిక రాణి నగర్‌, రహ్మత నగర్‌లలో పలువురికి ఎమ్మెల్యే పింఛన సొమ్మును అందజేశారు. నగరపాలక కమిషనర్‌ మల్లికార్జునరెడ్డి, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పింఛన్లు పంపిణీ అనంతపురంరూరల్‌ మండలంలోని అనంతపురం రూరల్‌ పంచాయతీ టీవీ టవర్‌, ఎన్టీఆర్‌ కాలనీల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ లబ్ధిదారులకు శనివారం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మండల ప్రత్యేక అధికారి మునిప్రసాద్‌, ఎంపీడీఓ దివాకర్‌, ఈఓఆర్డీ వెంకటనాయుడు, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌రావు, సర్పంచు ఉదయ్‌శంకర్‌, టీడీపీ జయరాంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2025 | 12:03 AM