Share News

Anand Mahindra: ఆంధ్రతో మా ప్రయాణం ప్రారంభం

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:44 AM

మహీంద్ర వాహనాలకు ఏపీ చాలా పెద్ద మార్కెట్‌. మహీంద్ర వాహన తయారీ యూనిట్‌ను సన్‌రైజ్‌ స్టేట్‌... ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే అంశాన్ని పరిశీలించండి’ అని మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

Anand Mahindra: ఆంధ్రతో మా ప్రయాణం ప్రారంభం

  • ఏపీలో అనేక అవకాశాలున్నాయి

  • ఆ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములం కావడం గర్వకారణం: ఆనంద్‌ మహీంద్ర

  • మీ వాహన తయారీ యూనిట్‌ను ఇక్కడ పెట్టండి: మంత్రి లోకేశ్‌

  • ఎక్స్‌ వేదికగా ఇరువురి సంభాషణ

అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): ‘మహీంద్ర వాహనాలకు ఏపీ చాలా పెద్ద మార్కెట్‌. మహీంద్ర వాహన తయారీ యూనిట్‌ను సన్‌రైజ్‌ స్టేట్‌... ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే అంశాన్ని పరిశీలించండి’ అని మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. మహీంద్ర సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర తమ సంస్థకు సంబంధించిన తెలుగు ప్రకటనను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దానిపై మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ... ‘తెలుగు ప్రకటన అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ మీ వాహనాలకు అతిపెద్ద మార్కెట్‌. ఈ ప్రకటనను కూడా ప్రజలు తప్పకుండా ఇష్టపడతా రు. అత్యాధునిక ఆటోమోటివ్‌ వ్యవస్థ, అతి పెద్ద మార్కెను ఉపయోగించుకోవడానికి మా రాష్ట్రంలో వాహన తయారీ పరిశ్రమ స్థాపనకున్న అవకాశాలను పరిశీలించండి. మీ బృందాన్ని స్వాగతించడానికి, మా వద్దనున్న అవధులులేని అవకాశాలను వివరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేరొ ్కన్నారు. లోకేశ్‌ సందేశానికి ఆనంద్‌ మహీంద్ర స్పందిస్తూ... ‘ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏపీ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములం కావడం మాకు గర్వకారణం. ఇప్పటికే మా బృం దాలు పలు రంగాలు.. సౌరవిద్యుత్‌, మైక్రో ఇరిగేషన్‌, పర్యాటకంలో పె ట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది... ముందు ఏమి ఉందో చూద్దాం..!’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 03:46 AM