Share News

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం: సీఎం రమేష్

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:20 PM

కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఉక్కు హౌస్‌‌లో కార్మిక సంఘాల నేతలతో సుమారు గంటపాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం: సీఎం రమేష్
union ministers at Vizag Steel Plant

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రులు విశాఖకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఉక్కు హౌస్‌‌లో కార్మిక సంఘాల నేతలతో సుమారు గంటపాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. (Vizag Steel Plant)


``ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మీ ముందు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇకనుంచి నిబద్దతతో పనిచేసి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను మళ్ళీ లాభాల్లోకి తెచ్చి, ఆదాయం సమకూర్చుకోవాలి. వనరులు మరింత పెంచేలా కృషి చేయాలి. కార్మిక సంఘాల నేతలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ ప్లాంట్‌ను అందరం కలిసి కాపాడుకుందాం. ప్రజల సెంటిమెంటును గుర్తించి ఆదుకున్నందుకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు`` అని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.


``స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చినందుకు ఆంధ్ర ప్రజలు తరపున ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. మోదీ నాయకత్వంలో కేంద్ర క్యాబినెట్ మంచి నిర్ణయం తీసుకుంది. ప్లాంట్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిపై నాకు అవగాహన ఉంది. కార్మికులు జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారని తెలుసు. ఇంకో మూడు నెలలపాటు జీతాలకు ఇబ్బంది ఉండచ్చు. ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను. ప్లాంట్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులు సహకరించాలి`` అని కుమారస్వామి అన్నారు. స్టీల్ ప్లాంట్ ను సందర్శించి అనంతరం కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా పరిశీలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 30 , 2025 | 04:20 PM