Share News

APPSC: గ్రూప్‌ 1 స్కామ్‌లో సవాంగ్‌ కూడా శిక్షార్హుడే

ABN , Publish Date - May 13 , 2025 | 04:53 AM

గ్రూప్‌-1 స్కామ్‌లో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ రెండూ శిక్షార్హులని నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు. వీరిద్దరూ మాన్యువల్‌ మూల్యాంకనం, డిజిటల్‌ మూల్యాంకనం విషయంలో అవినీతిని ఒప్పుకున్నారు.

 APPSC: గ్రూప్‌ 1 స్కామ్‌లో సవాంగ్‌ కూడా శిక్షార్హుడే

పీఎ్‌సఆర్‌ అక్రమాలను దాచారు

హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనంపై హైకోర్టుకు తప్పుడు సమాచారం

సవాంగ్‌నూ విచారించాలి: నీలాయపాలెం

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 స్కామ్‌లో సీనియర్‌ ఐపీఎస్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులుతో పాటు ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ కూడా శిక్షార్హుడేనని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా పీఎ్‌సఆర్‌ హాయ్‌ల్యాండ్‌లో మాన్యువల్‌ మూల్యాంకనం చేయించారని, అనంతరం కమిషన్‌ చైర్మన్‌గా వచ్చిన సవాంగ్‌ దానిని దాచిపెట్టారని అన్నారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్‌లో మాన్యువల్‌ మూల్యాంకనం జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారని, కానీ పీఎ్‌సఆర్‌ ఉద్దేశపూర్వకంగా డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేయించారని అన్నారు. దానిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, మాన్యువల్‌గా చేయాలని ఆదేశించిందని తెలిపారు. దాన్ని ఆసరాగా తీసుకున్న పీఎ్‌సఆర్‌ గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్‌ రిస్టార్ట్స్‌లో మాన్యువల్‌ మూల్యాంకనం ప్రారంభించి.. డ్రైవర్లు, వారి భార్యలు, వెల్డర్లు, పిల్లలతో మూల్యాంకనం చేయించారని ఆరోపించారు. పీఎ్‌సఆర్‌ బదిలీ తర్వాత చైర్మన్‌గా వచ్చిన గౌతమ్‌ సవాంగ్‌ మరిన్ని ఘోరాలకు పాల్పడ్డారని, డిజిటల్‌ మూల్యాంకనం, మాన్యువల్‌ మూల్యాంకనం ఫలితాల్లో 62 శాతం వ్యత్యాసం వచ్చిందని తెలిపారు. దీనిపై న్యాయస్థానం ఏపీపీఎస్సీకి చీవాట్లు పెట్టిందన్నారు. పీఎ్‌సఆర్‌ హయాంలో జరిగిన హాయ్‌ల్యాండ్‌ కథను సవాంగ్‌ కోర్టులో చెప్పకుండా తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని చెప్పారు. పీఎ్‌సఆర్‌ హాయ్‌ల్యాండ్‌లో చేయించిన మూల్యాంకనం గురించి సవాంగ్‌ ఎందుకు దాచిపెట్టారో చెప్పాలన్నారు. అలాగే అభ్యర్థులు రాసిన పేపర్లను రెండుసార్లు మూల్యాంకనం చేయిస్తే 62 శాతం తేడా ఎందుకు వచ్చిందో కూడా ఆయనకే తెలియాలన్నారు. ఏపీపీఎస్సీని పీఎ్‌సఆర్‌ తప్పుదోవ పట్టిస్తే, సవాంగ్‌ దానిని కొనసాగించారని విమర్శించారు. ఈ స్కామ్‌లో సవాంగ్‌ను కూడా విచారించాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:53 AM