AP GDP: రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాలే కీలకం
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:27 AM
బుధవారం మంగళగిరిలోని వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్లకు వ్యవసాయ, అనుబంధ రంగాల పరిస్థితులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ‘వచ్చే పదేళ్లు ఉద్యాన సాగుపై దృష్టి పెట్టాలి.
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడి
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): వచ్చే పదేళ్లు రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాలు కీలకమవుతాయని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. బుధవారం మంగళగిరిలోని వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్లకు వ్యవసాయ, అనుబంధ రంగాల పరిస్థితులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ‘వచ్చే పదేళ్లు ఉద్యాన సాగుపై దృష్టి పెట్టాలి. ఉత్పత్తి శుద్ధీకరణతో పంట విలువ పెంచాలి. ధర ఉందనే కారణంగా మితిమీరి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలి’ అని సూచించారు. అలాగే, ప్రకృతి సేద్యంపై వ్యవసాయ, ఉద్యానశాఖల జిల్లా అధికారుల శిక్షణ కార్యక్రమంలో రాజశేఖర్ వర్చువల్‌గా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానం అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News