Share News

Posani Krishna Murali: పోసానికి రిమాండ్‌లో రిమాండ్‌

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:33 AM

జనసేన నేత బాడిత శంకర్‌ ఫిర్యాదు మేరకు విజయవాడలోని భవానీపురం పోలీ్‌సస్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయన అరెస్టయి కర్నూలు జిల్లా జైలులో ఉన్నందున భవానీపురం పోలీసులు పీటీ వారెంట్‌పై కర్నూలు జైలు నుంచి శనివారం విజయవాడకు తీసుకొచ్చారు.

 Posani Krishna Murali: పోసానికి రిమాండ్‌లో రిమాండ్‌

20 వరకు విధించిన బెజవాడ కోర్టు

పీటీ వారెంట్‌పై హాజరుపరిచిన పోలీసులు

అనంతరం కర్నూలు జైలుకు తరలింపు

నరసరావుపేట పోలీసులూ పీటీ వారెంట్‌తో రాక

బెజవాడలోనే ఉంచాలని కోర్టులో పోసాని విజ్ఞప్తి

విజయవాడ, నరసరావుపేట లీగల్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళికి.. రిమాండ్‌లో ఉండగానే మరో రిమాండ్‌ పడింది. జనసేన నేత బాడిత శంకర్‌ ఫిర్యాదు మేరకు విజయవాడలోని భవానీపురం పోలీ్‌సస్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయన అరెస్టయి కర్నూలు జిల్లా జైలులో ఉన్నందున భవానీపురం పోలీసులు పీటీ వారెంట్‌పై కర్నూలు జైలు నుంచి శనివారం విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఆయనను హాజరుపరచగా న్యాయాధికారి ఎన్‌.రాజశేఖర్‌ ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం పోసానిని విజయవాడ నుంచి కర్నూలు జైలుకు తరలించారు.


నాకేమీ తెలియదు: పోసాని

రిమాండ్‌ విధించడానికి ముందు పోసానికి న్యాయాధికారి పలు ప్రశ్నలు వేశారు. ‘మీపై నమోదైన కేసు గురించి తెలుసా’ అని ప్రశ్నించగా, తనకేమీ తెలియదని, పోలీసులు ఎటువంటి కాగితాలూ ఇవ్వలేదని పోసాని తెలిపారు. తనకు గొంతు పక్షవాతం ఉందని, గుండెకు శస్త్రచికిత్స చేశారని చెప్పారు. తనకు శిక్ష విధించినా, విధించకపోయినా విజయవాడలోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తనపై పోలీసులు అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ఎక్కడెక్కడో తిప్పుతున్నారని ఫిర్యాదు చేశారు. అయితే, పీటీ వారెంట్‌పై హాజరుపరిచినందున తానేమీ చేయలేనని న్యాయాధికారి పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే రెగ్యులర్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే జైలులో వైద్యాధికారులకు చూపించుకోవాలన్నారు.

నరసరావుపేటలో పోలీస్‌ కస్టడీ వాయిదా..

పోసానిని నరసరావుపేట రెండో పట్టణ పోలీసులకు రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ నరసరావుపేట మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పోసాని అందుబాటులో లేకపోవడంతో పోలీస్‌ కస్టడీ తాత్కాలికంగా వాయిదా పడింది. నరసరావుపేట పోలీసులు శనివారం కర్నూలు జిల్లా జైలులో పీటీ వారెంట్‌ పత్రాలు సమర్పించగా, అప్పటికే విజయవాడ భవానీపురం పోలీసులు పోసానిని తీసుకెళ్లడంతో నరసరావుపేట పోలీసులు వెనుతిరిగారు. తిరిగి సోమవారం నరసరావుపేట పోలీసులు పోసానిని కస్టడీకి తెచ్చుకునేందుకు వెళ్లే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2025 | 07:50 AM