Share News

Sap Chairman : పీ4 కింద 410 మంది నిరుపేద క్రీడాకారుల ఎంపిక

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:42 AM

పీ4 పథకం కింద 410మంది నిరుపేద క్రీడాకారులను ఎంపిక చేసినట్టు శాప్‌ చైర్మన్‌ ఎ.రవినాయుడు తెలిపారు.

Sap Chairman : పీ4 కింద 410 మంది నిరుపేద క్రీడాకారుల ఎంపిక

  • శాప్‌ చైర్మన్‌ రవినాయుడు

తిరుపతి(క్రీడలు), జూలై 29(ఆంధ్రజ్యోతి): పీ4 పథకం కింద 410మంది నిరుపేద క్రీడాకారులను ఎంపిక చేసినట్టు శాప్‌ చైర్మన్‌ ఎ.రవినాయుడు తెలిపారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... ‘వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుతున్న 410మంది నిరుపేద క్రీడాకారులను గుర్తించాం. ఆర్థికస్తోమత లేనికారణంగా వీరంతా గల్లీలకే పరిమితమవుతున్నారు. పీ4 పథకం ద్వారా వీరిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంపిక చేసిన వారిని దాతలకు అప్పగించే చర్యలు చేపట్టాం. ఇప్పటికే పాతికమందికిపైగా దాతలకు అప్పగించాం’ అని తెలిపారు. ఈ ప్రతిపాదనలను ప్రవాసాంధ్రులకు పంపినట్టు తెలిపారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో పీ4 పథకం కింద క్రీడాకారుల దత్తతకు సుముఖంగా ఉన్నామని పలువురు చెప్పారన్నారు. ఇటీవల సీఎ్‌సఆర్‌ ఫండ్‌(కార్పొరేట్‌ సామాజిక బాధ్యత)ద్వారా గ్రీన్‌కో(సోలార్‌ కంపెనీ) రూ.21కోట్లు వితరణ చేయగా, కర్నూలులోని ఓర్వకల్లులో క్రీడాప్రాంగణం, మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 05:42 AM